ఐదు భాషల్లో పుష్ప రిలీజ్.. డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతున్న డంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా నెంబర్ 17 న భారీ స్థాయిలో విడుదల కానుంది. అంతేకాకుండా ఈ సినిమాతో మొదటిసారిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు బన్నీ. పుష్ప సినిమా టీమ్ ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

అక్కడ మైత్రి,గోల్డ్ మైన్స్ మధ్య వివాదం తలెత్తింది. ఎట్టకేలకు అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వడం తో సమస్యను సామరస్యపూర్వకంగ సద్దుమణిగింది. పుష్ప హిందీ పంపిణీ హక్కులను ఏఏ ఫిల్మ్స్ దక్కించుకుంది. ఏఏ ఫిలిమ్స్ రవీనా టాండన్ భర్త అనిల్ తడానీది. బాలీవుడ్ లో పెద్ద డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న ఆయన పుష్ప సినిమా కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాడు. ఇది ఇలా ఉండగా మిగతా భాషల్లోనూ పుష్పా డిస్ట్రిబ్యూటర్లు కరారైనట్లు సమాచారం.ఈ4 ఎంటర్టైన్మెంట్ మలయాళంలో, లైకా ప్రొడక్షన్స్ తమిళంలో, స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ కన్నడలో, ఏఏ ఫిలిమ్స్ ఇండియాలో, ఓవర్శిస్ లో హంసిని ఎంటర్టైన్మెంట్ “పుష్ప”ను విడుదల చేయబోతున్నారు. పుష్ప మేకర్స్ ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తున్న విషయం తెలిసిందే.

Share.