టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మొత్తం అఖిల్ ఈ ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ కోసం హంగేరి కి వెళ్లి వచ్చిన తర్వాత కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కేవలం సురేందర్ రెడ్డి కి మాత్రమే కాకుండా అతనితోపాటు ఆయన కుటుంబానికి కూడా కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
సురేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలడంతో షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. హీరో అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఏజెంట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే హంగేరిలో ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వచ్చింది. సురేందర్ రెడ్డి కోలుకున్న అనంతరం షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.