బంగార్రాజు మూవీ పై మరొక అప్డేట్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో నాగ చైతన్య, నాగార్జున కలిసి నటిస్తున్నారు. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ కంటిన్యూ అవుతుండగా , నాగచైతన్య కు జోడిగా బేబమ్మ అలియాస్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో కృతి శెట్టికి సంబంధించి నాగలక్ష్మి గా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నారు.ఇకపోతే ఈ సినిమా నుంచి మరొక అప్ డేట్ వచ్చింది .

ఇకపోతే ఈ సినిమా కు సంబంధించి వచ్చే నవంబర్ 22న సాయంత్రం 5 గంటల 22 నిమిషాలకు “బంగార్రాజు” ఫస్ట్ లుక్ తో పలకరించనున్నాడట నాగార్జున. అలాగే టీజర్ నవంబర్ 23న ఉదయం 10 గంటల 23 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అదిరే అప్డేట్స్ ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మాణం అందిస్తున్నారు.

Share.