ఎన్టీఆర్ కు ఆహ్వానం పంపిన బాలకృష్ణ.. కారణం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్టీఆర్ ఎన్నో ఫ్లాపుల తర్వాత, టెంపర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తరువాత వరుసగా ఐదు విజయాలను సొంతం చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఇప్పుడు తాజాగా RRR సినిమాతో డబ్బులు హ్యాట్రిక్ సాధిస్తారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాల వైపు మొగ్గు చూపుతున్నాడు. అయితే ఇక బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించి చాలా రోజులు అవుతోంది.

దీంతో బాలకృష్ణ అఖండ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వాన పంపించినట్లు గా సమాచారం. ఇక ఇప్పటికే రిలీజ్ అయినా అఖండ సినిమా ట్రైలర్ చూసిన అభిమానులు ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా చాలా గ్రాండ్ గా చేయాలని నిర్ణయించారట చిత్ర యూనిట్ సభ్యులు.డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.ఈనెల 27వ తేదీన సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

బాలకృష్ణ,ఎన్టీఆర్ ను ఒకే వేదికపై చూడాలి అన్నట్లుగా ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా అయినా రావాలని అభిమానులు భావిస్తున్నారు.

Share.