పుష్ప సినిమా తమిళ్ రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో అనసూయ, సునీల్, ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన విడుదల కానుంది.

ఇప్పటి వరకు ఈ సినిమా సంబంధించి పలు పోస్టర్లు, వీడియో సాంగ్ లు, విడుదల కాగా మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగులో హీరోయిన్ సమంత నటిస్తున్నట్లుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారుతోంది. ఈ సినిమా తమిళ వెర్షన్ కి సంబంధించిన హక్కులను లైకా ప్రొడక్షన్ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్ధ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసిందని సమాచారం. అంతే కాకుండా తమిళ సినిమా హక్కులను ఏడు కోట్ల రూపాయల వరకు సొంతం చేసుకున్నట్లు గా సమాచారం. ఇక RRR సినిమాను కూడా ఇదే సంస్థ తీసుకున్నట్లుగా సమాచారం.

Share.