చిరు‌కి చరణ్ స్పెషల్ విషెస్… !

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, చిరుకు ఆయన తనయడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇందుకుగాను ట్విట్టర్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో చెర్రీ-చిరు ‘ఆచార్య’ సెట్స్‌కి వెళ్తున్నారు. మెగాస్టార్‌తో కలిసి నటించే ప్రతీ షాట్ ఒక గొప్ప లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోస్ట్ చేశారు. టాలెంటెడ్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆచార్య’ మూవీపై ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

ఈ సినిమాలో చిరుకు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, చరణ్ సరసన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కనిపించనుంది. ఇక ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా ఓ సాంగ్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘ఆచార్య’ చిత్రంలో ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్‌ను రామ్ చరణ్ తేజ్ ప్లే చేస్తున్న సంగతి అందరికీ విదితమే.

Share.