‘భోళా శంక‌ర్’గా మెగాస్టార్‌ చిరు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరు సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నాడనే చెప్పొచ్చు. పాలిటిక్స్‌లోకి వెళ్లి తిరిగి సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ‘ఖైదీ నెం.150’ ఫిల్మ్‌తో సత్తా చాటాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా చిరు బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల అప్‌డేట్స్ ఇచ్చేశారు మేకర్స్. డైరెక్టర్ మెహర్ రమేశ్ మొదటి సారి చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘వేదాళం’ రీమేక్ తెలుగులో చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు.

‘భోళా శంకర్’గా సినిమా టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. అన్నా చెల్లెల అనుబంధంపై సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా ‘మహానటి’ కీర్తిసురేశ్ నటిస్తోందని తెలుస్తోంది. ఇకపోతే మెహర్ రమేశ్ డైరెక్ట్ చేసిన గత చిత్రాలు ‘శక్తి, షాడో’ రెండూ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అప్పటి నుంచి మెహర్ సినిమాలు చేయలేదు. కాగా, తాజాగా మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశారు. ఈ సారి మెహర్ కంపల్సరీ హిట్ కొడతారనే నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Share.