ఆ హీరోతో నిశ్చితార్థం చేసుకున్న కత్రినాకైఫ్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న కత్రినా కైఫ్.. యంగ్ హీరో విక్కీ కౌశల్‌ తో సీక్రెట్ రిలేషన్‌షిప్‌ కొనసాగిస్తున్నారు. కానీ తమ మధ్య రొమాంటిక్ రిలేషన్ ఉందని ఏ సందర్భంలోనూ తెలపలేదు. ఈ జంట రహస్యంగా ఫంక్షన్స్‌కు అటెండ్ కావడం, హాలిడే వెకేషన్స్‌కు కలిసి వెళ్లడం చూస్తుంటే వీరి మధ్య ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ ఉందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను వేరే లెవెల్ కి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది.

తాజాగా కత్రినా, విక్కీల నిశ్చితార్థం రహస్యంగా జరిగిపోయిందని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. కొద్దిరోజుల్లో రోకా ఫంక్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ తమ సినిమా ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. దాంతో మాకు తెలియకుండానే అప్పుడే నిశ్చితార్థం కూడా జరిగిపోయిందా.. అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కత్రినాకైఫ్ ప్రేమ విషయంలో విఫలమయ్యారు. కొన్నేళ్లక్రితం అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి కానీ తనకు పెళ్లి కావడం లేదని బెంగ పెట్టుకున్నారు. అయితే ఎట్టకేలకు ఆమె నిశ్చితార్థం చేసుకున్నారని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share.