సుధీర్‌కి అండగా మహేశ్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ‘ఎస్ఎంఎస్(శివ మనసులో శృతి)’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పట నుంచి వరుస సినిమాలు చేస్తున్న సుధీర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. సుధీర్ నేచురల్ స్టార్ నానితో కలిసి నటించిన ‘వీ’ చిత్రంలో ప్రేక్షకులకు చివరగా కనిపించారు. ఈ సినిమా కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో విడుదలైంది. ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్.

ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఈ సినిమాకు ఇంకొంచెం బూస్టప్ ఇచ్చేందుకుగాను సూపర్ స్టార్ మహేశ్ రంగంలోకి దిగుతున్నారట. ఈ ఫిల్మ్ థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా విడుదల చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 19న 10 గంటలకు మహేశ్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. ఈ ఫిల్మ్‌కు కరుణ కుమార్ దర్శకత్వం వహించగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించారు. మహేశ్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Share.