పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రాల్లో “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ పీరియాడిక్ చిత్రం నుంచి యూనిట్ ఒక కీలక అప్డేట్ ను రివీల్ చేశారు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న యంగ్ అండ్ టాలెంటడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ పుట్టినరోజు. దాంతో ఈ చిత్ర బృందం ఈరోజు కావడంతో ఆమె పాత్ర పేరును మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ‘పంచమి’ అనే పాత్రలో నటిస్తుందని నాట్యం చేస్తున్న లుక్ లో ఫోటోను విడుదల చేసి బర్త్ డే విషెష్ చెప్పారు.
కొన్ని రోజుల నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది తీపి కబురే. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ లేక కొన్ని నెలలు కావస్తోంది. షూటింగ్ ఆగిపోయిందా అనే సందేహాలు కూడా వచ్చాయి. వాటన్నింటిని పటాపంచలు చేశారు ఈ అప్డేట్తో. అద్భుతమైన లుక్ తో నిధి అగర్వాల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.