సత్యదేవ్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాను నటించే ప్రతి సినిమాలో కూడా వైవిధ్యభరితమైన ప్రదర్శన కనబరుస్తాడు.డిఫరెంట్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చోరుగున్నాడు. రీసెంట్ గా ‘తిమ్మరుసు’ చిత్రం ద్వారా మన ముందుకు వచ్చాడు.ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరో రేంజ్ కి ఎదిగాడు.తాజాగా సత్యదేవ్ తీవ్రవాదం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న హబీబ్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సత్య దేవ్ కు ఎదురైన కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు.
హబీబ్ చిత్రం షూటింగ్ ను ఆఫ్గనిస్తాన్ దేశంలో షూటింగ్ చేసే సమయంలో ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయట. ఆఫ్గనిస్తాన్ దేశంలో తాలిబన్లు హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఆ దేశాన్ని సొంతం చేసుకోవడానికి తాలిబన్లు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు.ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా సత్యదేవ్ తన ప్రాణాలకు తెగించి మరి షూటింగ్ లో పాల్గొన్నాడట. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరో తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మరి సత్యదేవ్ ను చంపేస్తామంటూ బెదిరించారట. ఎన్ని ఆపదలు, బెదిరింపులు ఎదురయినా గాని ఆ సినిమా తీయాలని పట్టుదల నాలో బలంగా ఉండిపోయిందని చెప్పారు.