తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లో కూడా మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక మైన్ గా మోహన్ బాబు గురించి అందరికి తెలిసిందే. ఏది చెప్పాలన్నా గాని ఎటువంటి మొహమాటం లేకుండా చేప్పేస్తారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇండస్ట్రీలోనూ, రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల మోహన్ బాబు ఒక ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినా తరుణంలో ఆయన ఎదుర్కున్న రాజకీయ సంఘటనలను గుర్తు చేసుకున్నారు. అసలు మోహన్ బాబును రాజకీయాలలోకి రమ్మని ప్రేరేపించని వ్యక్తి ఎన్టీఆర్ గారే అనే తెలిపారు. ఆయన ప్రోత్సాహంతోనే మోహన్ బాబు ఎంట్రీ జరిగింది అని తెలిపారు.
అయితే చంద్రబాబు నాయుడు అధీనంలో ఉన్న హెరిటేజ్ కంపెనీ నిజానికి చంద్రబాబుడి గారిది కాదట. ఆ కంపనీ నాదే అని మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. అసలు హెరిటేజ్ కంపెనీలో అత్యధికంగా షేర్లు పెట్టింది నేనే అని, ఆ కంపనీ నాకు కాకుండా చంద్రబాబు నాయుడు చేతులోకి వెళ్లిపోయిందని అయిన తెలియచేసినట్లు సమాచారం. అంతే కాకుండా మోహన్ బాబు టీడీపి పార్టీ నుంచి తప్పుకోవడానికి గల కారణం కూడా చంద్రబాబే అని తెలిపారు. ఏది ఏమైనా కానీ మోహన్ బాబు హెరిటేజ్ కంపనీ గురించి, చంద్రబాబు నాయుడు గురించి తెలిపిన మాటలు తీవ్ర దుమారాన్ని సృస్టిస్తునాయి.