జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్స్.. ఫొటోస్ వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అతిలోక సుందరి శ్రీదేవికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆమె తనయ జాన్వీకపూర్ కూడా అచ్చం శ్రీదేవి లాగానే యాక్టింగ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, శ్రీదేవి అంత కాకపోయినా తనదైన స్థాయిలో కృషి చేస్తోంది. ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

ఇన్ స్టా వేదికగా తన పర్సనల్ ప్లస్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటు ఉంటుంది ఈ భామ. తాజాగా జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌ను పోస్ట్ చేయగా, ఆ ఫొటోలను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందాల ‘దేవత’లా జాన్వి ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే జాన్వీకపూర్‌ను ‘జూనియర్ అతిలోక సుందరి’గా అభివర్ణిస్తున్నారు. జాన్వి గ్లామర్ ప్లస్ అభినయం ఉన్న నటి అని నిరూపించుకుందని పేర్కొంటున్నారు. త్వరలో మరిన్ని చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్‌కు ధీటుగా నిలిచే అవకాశాలున్నాయని సినీ పరిశీలకులు పేర్కొంటున్నారు.

Share.