మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రతిరోజు పండుగే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు సాయి ధరం తేజ్. తను సోలోగానే ఉందామని ఫిక్స్ అయినట్టు తెలిపాడు ఈ మెగా హీరో. తనకు కొంత సమాజ సేవ చేయాలని ఉందని పెళ్లైతే తన భార్య అందుకు అడ్డు పడుతుందని అందుకే పెళ్లి చేసుకోకుండా ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పాడు సాయి తేజ్.
కొన్నాళ్లు ఓ తెలుగు హీరోతో డేటింగ్ లో ఉన్నాడన్న వార్తలు వచ్చిన ఈ హీరో ఆమె ప్రేమ విఫలమవడమే ఇందుకు కారణమని కొందరు అంటున్నారు. తిక్క నుండి ఇంటిలిజెంట్ వరకు వరుస ఆరు ఫ్లాపులు ఫేజ్ చేసిన తేజూ చిత్రలహరి సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో మారుతి డైరక్షన్ లో చేసిన ప్రతిరోజు పండుగే సినిమా తో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు సాయి ధరం తేజ్.
అయితే ఈ హీరో పెళ్లి విషయంపై చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ ను షాక్ అయ్యేలా చేస్తున్నాయి. తన ఆలోచనలకు సపోర్ట్ గా నిలిచే భార్యను పొందాలి కాని సమాజ సేవ కోసం పెళ్లి చేసుకోకుండా ఉండటం మాత్రం కరెక్ట్ కాదన్నది కొందరి అభిప్రాయం. మరి నిజంగానే మెగా హీరో పెళ్లికి దూరంగా ఉంటాడా అన్నది చూడాలి.
నా జీవితంలో పెళ్లనేది లేదు.. మెగా హీరో షాకింగ్ డెశిషన్..!
Share.