8 ఏళ్ల ఆరాటాన్ని బాలయ్య తీర్చగలడా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూలర్’. హీరోగా బాలయ్యకు 105వ సినిమా. ‘జై సింహా’ తర్వాత కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజ‌గా సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు.. యూ/ఏ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్‌, ట్రైల‌ర్‌ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో హీరో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అప్పుడెప్పుడో 2007 విజయదశమి చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన వేదిక..ఆ తర్వాత బాణం సినిమాలో నారా రోహిత్ సరసన నటించింది. కానీ ఈ రెండు చిత్రాలు ఆమెకు స‌క్సెస్ అందించ‌లేక‌పోయాయి. దీంతో ఈమెకు తెలుగులో అవ‌కాశాలు రాకపోయినప్పటికీ తమిళం లో వరుస సినిమాలు చేసి అక్కడ మంచి గుర్తింపే తెచ్చుకుంది. మ‌ళ్లీ లాంగ్ గ్యాప్ త‌ర్వాత‌ రూల‌ర్ సినిమాలో త‌న‌ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది వేదిక.

ఈ సినిమాలో వేదిక ట్రెడిషనల్‌.. గ్లామర్‌ గర్ల్‌.. సీరియస్‌ యాంగిల్‌లో క‌నిపించ‌నుంద‌ట‌. మ‌రి ఈ సారైనా అదృష్టం క‌లిసొచ్చి ఓ హిట్ ఖాతాలో వేసుకుంటుందో.. లేదో.. చూడాలి. కాగా, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. కేఎస్ రవికుమార్, బాలయ్య కాంబినేషన్‌లో ఇప్పటికే ‘జైసింహా’ వచ్చి.. మంచి హిట్ అయింది. దీంతో ఈ ‘రూలర్’ మూవీపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

Share.