బిగ్ బి అమితాబ్ బచ్చన్ తాజాగా ఒక వివాదం లో చిక్కుకున్నారు. కళ్యాణ్ జువెలర్స్ సంస్థ కి అమితాబ్ ప్రచారకర్త గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే దుబాయ్ లోని ఒక షో రూమ్ లో నకిలీ బంగారం అమ్మినట్టుగా కళ్యాణ్ జువెల్లర్స్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. వీటిని ఖండిస్తు తాజాగా ఆ సంస్థ వారు అమితాబ్ తో ఒక యాడ్ ని విడుదల చేసారు. అందులో అమితాబ్ తో పాటు అయన కూతురు శ్వేతా కూడా నటించారు. ఈ యాడ్ లో భాగంగా అమితాబ్ అయన కూతురితో ఒక బ్యాంక్ కు వెళ్లి.. తన పెన్షన్ డబ్బులు రెండు సార్లు తన ఎకౌంట్ కి క్రెడిట్ చేయబడ్డాయి అని చెప్తారు. దానికి బ్యాంక్ ఉద్యోగి ఎవరికీ ఈ విషయం చెప్పకుండా ఆ డబ్బుని అలాగే వాడుకోమని చెప్తాడు.
దానికి అమితాబ్ నిరాకరిస్తాడు..అటు తర్వాత ‘కళ్యాణ్ జువెల్లర్స్ వారు కూడా ఇంత నిజాయితీగా ఉంటారని చెబుతూ ఈ యాడ్ ముగుస్తుంది’ అయితే ఇక్కడ కళ్యాణ్ జువెల్లర్స్ గొప్పలు చెప్పే క్రమంలో బ్యాంకింగ్ వ్యవస్థని, బ్యాంక్ సిబ్బందిని తప్పుగా చూపారంటూ.. బ్యాంక్ యూనియన్ సంఘల వారు ఈ యాడ్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. దీనికి స్పందించిన సంస్థ యాజమాన్యం ఈ యాడ్ లో మార్పులు చేస్తామని వెల్లడించారు.