దుమ్మురేపిన‌ `ప్రతిరోజూ పండగే` ప్రీ- రిలీజ్ బిజినెస్..

Google+ Pinterest LinkedIn Tumblr +

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ అంటూ సంక్రాంతి కన్నా ముందే తెలుగు ప్రేక్షకులకు పండగ తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన రాశి ఖన్నా ఆడిపాడుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ సెలవులు కూడా సినిమా కలెక్షన్స్ కి బూస్ట్ ఇవ్వనున్నాయి. మీణ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య పెనవేసుకున్న ప్రేమానురాగాల చుట్టూ తిరిగే కథ ఇది. యూత్ మొదలుకొని ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఆకట్టుకునే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందిందని తెలుస్తోంది. దర్శకుడు మారుతి ఈ చిత్రంతో ఫ్యామిలీ ఎమోషన్స్ ద్వారా మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

సినిమా మొత్తం కుటుంబ సరదాలు, ఎమోషన్స్ ని హైలైట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దుమ్మురేపేశాయి. ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 18 కోట్ల‌కు అమ్ముడైంది. వాస్త‌వానికి ఈ చిత్రం రూ. 18 కోట్ల‌తో నిర్మించారు. మరియు థియేట్రికల్ హక్కులకు రూ .14 కోట్లు లభించాయి. దీంతో సినిమా విడుద‌ల‌కు ముందే మేకర్స్ లాభాల్లో మునిగార‌ని చెప్పాలి.

`ప్రతిరోజూ పండగే` ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రీ- రిలీజ్ బిజినెస్‌(రూ. కోట్ల‌లో):

నైజాం- రూ.5.50 కోట్లు
సీడెడ్- రూ.2.80 కోట్లు
వైజాగ్- రూ.2 కోట్లు
తూర్పు- రూ.1.30 కోట్లు
పశ్చిమ- రూ.1.10 కోట్లు
కృష్ణ- రూ. 1.20 కోట్లు
గుంటూరు- రూ .1.45 కోట్లు
నెల్లూరు- రూ. 0.65 కోట్ల
————————————————
ఏపీ+ తెలంగాణ మొత్తం- రూ.16 కోట్లు
————————————————

భారతదేశం- రూ. 1 కోట్లు
ప్రపంచం- రూ. 1 కోట్లు
—————————————–
మొత్తం- రూ. 18 కోట్లు
————————————–

Share.