నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం `రూలర్`. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించగా, సీ కళ్యాణ్ సినిమాని నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా నిర్వహించింది. ఈ చిత్రంలో బాలకృష్ణ బీహార్ పోలీస్‌గా, స్టైలిష్ వ్యాపారవేత్తగా.. రెండు షేడెడ్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇక బాలకృష్ణ సరసన వేదిక, సోనాలి చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. మరియు ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇక నటసింహ నందమూరి బాలకృష్ణ అంటేనే వెంటనే గుర్తుకు వచ్చేది పవర్ పుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్, మాస్ సీన్స్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే రూలర్ సినిమాలో మొత్తం ఐదు యాక్షన్ ఎపిసోడ్లు పెట్టారట. వాటిలో మూడు అన్బు అరివు మాస్టర్స్, మిగిలిన రెండూ రామ్ లక్ష్మణ్ జంటలు కొరియోగ్రఫీ చేశారట. ఇదిలా ఉంటే.. రూలర్ సినిమా సెకెండాఫ్‌లో భూమికా పాత్ర ఆశ్చర్యకరమైన ప్యాకేజీగా ఉండబోతోందట. ఈమె పాత్రలో అదిరిపోయే ట్విస్టులు, ఆశ్చర్యకరమైన అంశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఫస్టాఫ్‌లో యాక్షన్ మరియు ఇతర మాస్ ఎలిమెంట్స్‌తో నింపగా.. సెకెండాఫ్ మాత్రం ఊహించని మలుపులు ఉండనున్నాయి. అలాగే ఈ సినిమా రన్‌టైమ్ 2 గం 30 నిమిషాలకు లాక్ చేయబడింది. ఎక్కువ సమయం అయినప్పటికీ.. ఇందులో బాలకృష్ణ రైతు ఎపిసోడ్ ప్రతి ఒక్కరినీ ఉద్వేగానికి గురి చేస్తుందట. కాగా, ‘జై సింహా’ తర్వాత కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోసారి బాలకృష్ణ..ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెట్ మూవీతో ఆడియన్స్‌ను పలకరించబోతున్నాడు.