ఆంధ్రాలో షూటింగ్‌లు బంద్… ఎందుకు…?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబంధాలు చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం కాని సమస్యలను రెండు మూడు సమావేశాల్లో కేంద్రం ప్రమేయం లేకుండానే ఇద్దరు ముఖ్యమంత్రులు పరిష్కరించుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు కూడా… జలవనరులు, ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న ఆస్తుల పంపకం వంటి వాటి విషయంల్లో కెసిఆర్ జగన్ చాలా దూకుడుగా వెళ్ళారు.

అయితే ఇప్పుడు ఆ సంబంధాలు చెడిపోయాయని అంటున్నారు. ఆర్టీసి, వాహన మిత్ర విషయంలో జగన్ అనుసరించిన వైఖరే దీనికి కారణమని అంటున్నారు. ఆర్టీసి సమ్మె తెలంగాణాలో జరగడానికి ప్రధాన కారణం జగన్ అనేది ముఖ్యమంత్రి కెసిఆర్ భావన. ఇక్కడ విలీనం అని మొదలుపెట్టి పక్క రాష్ట్రం వాళ్ళను జగన్ రెచ్చగొట్టారని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది. అలాగే కేంద్రానికి అనుకూలంగా తనకు వ్యతిరేకంగా జగన్ పని చేస్తున్నారని కూడా కెసిఆర్ నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆదాయవనరుల మీద దెబ్బ కొడుతున్నారని అంటున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన కొన్ని కంపెనీలను తెలంగాణాలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగే సినిమా షూటింగ్ లను కూడా అక్కడి ప్రభుత్వం అడ్డుకుంటుంది అంటున్నారు. చిన్న సినిమాలకు గత ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో ఆంధ్రాలో చిత్రీకరణ చేస్తున్నారు. ఆ రాయితీలు తాను కూడా ఇస్తానని మీరు ఇక్కడే షూటింగ్ లు చెయ్యాలని కెసిఆర్ చెప్పినట్టు సమాచారం. కొంత మంది అగ్ర నిర్మాతలకు కూడా ఈ విషయాన్ని చెప్పినట్టు సమాచారం. అవసరమైతే కర్ణాటక వెళ్ళండి గాని,

ఆంధ్రా వద్దని కెసిఆర్ స్పష్టంగా చెప్పారట. ఇటీవల కేటిఆర్ కొందరు నిర్మాతలతో సమావేశమై ఆంధ్రాలో షూటింగ్ అవసరమైతే తప్పా వెళ్ళవద్దని… మీకు ఏం కావాలన్నా మేము చేస్తామని చెప్పారట. ఇక ఇదే సమయంలో తెలంగాణాలో ఉండే నటులకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెప్పినట్టు సమాచారం. ఇక తెలంగాణా కేంద్రంగా పని చేసే మీడియా సంస్థలు కూడా అక్కడి ప్రభుత్వ విషయంలో సానుకూలత వద్దని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు.

Share.