శ్వేతాబసు ప్రసాద్ ఈ పేరు మన తెలుగు వాళ్లకే కాదు.. అన్ని సినిమా ఇండస్ట్రీ వాళ్లకు బాగా పాపులర్. సెక్స్ రాకెట్లో అడ్డంగా బుక్ అయిన ఈ కుర్ర హాట్ హీరోయిన్ గతేడాది గ్రాండ్‌గా వివాహం చేసుకుంది. తెలుగులో తక్కువ టైంలోనే కుర్ర కారు గుండెల్లో గిలిగింతలు పెట్టేసిన ఈ అమ్మడు తర్వాత సరైన అవకాశాలు లేక.. కెరీర్ పరంగా రాంగ్ స్టెప్పులు వేయడంతో ఒక్కసారిగా పాతాళంలో పడిపోయింది.
ఇక సెక్స్ రాకెట్లో బుక్ అయ్యి బయటకు వచ్చాక శ్వేతా బసు ప్రసాద్ తనకు బాగా క్లోజ్ అయిన బాయ్ ఫ్రెండ్ రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడింది. గతేడాది డిసెంబర్లో తన బాయ్‌ఫ్రెండ్ రోహిత్ మిట్టల్‌తో శ్వేతా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరు యేడాదికే విడిపోయారు. దీనిపై శ్వేత సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
కొన్ని నెలలుగా మా మధ్య విబేధాలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే రోహిత్‌తో ఆమె విడిపోతున్నా అతడికి కూడా థ్యాంక్స్ చెప్పింది. నేను మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చినందుకు, ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తిగా నిలించినందుకు థ్యాంక్యూ రోహిత్ అని శ్వేతా పేర్కొన్నారు.