సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి మొదటి వారంలో జరుగుతుంది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ వస్తాడని తెలుస్తుంది. మహేష్ కోసం చరణ్ వస్తే అది మెగా ఈవెంట్ మరింత సక్సెస్ కానుంది.
మహేష్ భరత్ అనే నేను సినిమాకు ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చాడు. ఆ సినిమా ఈవెంట్ ఎల్బి స్టేడియం లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఇప్పుడు చరణ్ గెస్ట్ గా వచ్చే ఈ ఈవెంట్ కూడా భారీ స్థాయిలో జరుగుతుందని తెలుస్తుంది. అంతేకాదు మహేష్ చరణ్ తో పాటుగా ఇండస్ట్రీ పెద్దలు కూడా తరలి వచ్చే అవకాశం ఉందని టాక్.
మహేష్, చరణ్, ఎన్టీఆర్ ముగ్గురు సినిమాల ద్వారా పోటీ పడ్డా ఆఫ్ స్క్రీన్ చాలా క్లోజ్ గా ఉంటారు. మహేష్ సినిమాకు ఇప్పటికే తారక్ వచ్చి సినిమా కోసం ప్రమోట్ చేశాడు. ఇప్పుడు ఆ బాధ్యతా చరణ్ తీసుకుంటున్నాడు. ఒకే వేదిక మీద చరణ్, మహేష్ ఇక తెలుగు ఆడియెన్స్ కు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. తారక్ చరణ్ ను కలిసి చూసి రాజమౌళికి ఆర్.ఆర్.ఆర్ సినిమా ఆలోచన వచ్చింది ఇక ఇప్పుడు అలానే మహేష్ చరణ్ లతో కూడా ఏదైనా సినిమా ప్లాన్ చేస్తారేమో చూడాలి.