కన్నడ మూవీ కె.జి.ఎఫ్ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో యష్ హీరోగా నటించాడు. కేవలం కన్నదలోనే కాదు తెలుగు, తమిళ, హిందీ భాషలలో కూడా కె.జి.ఎఫ్ సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ ఒక్క సినిమాతో యష్ సౌత్ లో తన సత్తా చాటాడు. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 సక్సెస్ అవడంతో ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజైన కె.జి.ఎఫ్ మూవీ ఇప్పటికి రికార్డులు కొడుతూనే ఉంది. డిసెంబర్ లో రిలీజై వెండితెర మీద సూపర్ సక్సెస్ అందుకున్న ఈ మూవీ ఆన్ లైన్ లో కూడా సూపర్ హిట్ అయింది. అమెజాన్ లో ఈ ఇయర్ అన్ని భాషల్లో కలిపి ఎక్కువ చూసిన సినిమా కె.జి.ఎఫ్ అవడం విశేషం. సో సౌత్ లోనే కాదు బాలీవుడ్ సినిమాలను కూడా దాటేసి అమెజాన్ ప్రైమ్ లో సత్తా చాటింది కె.జి.ఎఫ్ మూవీ.
ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ని భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వల్ లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ నటిస్తున్నారు. ఇది కూడా పార్ట్ 1 లా ఉంటే మాత్రం మరోసారి కె.జి.ఎఫ్ మూవీ సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు.