యంగ్ హీరో కార్తికేయ ఈ ఏడాది విడుదల చేసిన మూడవ చిత్రం 90ఎంఎల్. నేహా సోలంకి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి తెరకెక్కించారు. ఓ వైవిధ్యమన పాయింట్ ఆధారంగా యూత్ ఫుల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ప్రతి రోజు 90 ఎంఎల్ మందు తాగనిదే ఉండలేని వ్యక్తిగా కార్తికేయ నటించాడు.
ఇక ఈ వారం రిలీజ్ అయిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకి 3.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు లెక్కలు కట్టాయి. అయితే ఈ సినిమా మూడు రోజుల్లో 1.50 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రు. 2 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పూర్తిగా డ్రాప్ అయ్యాయి.
ఇక ఎలాగూ వీకెండ్ అయిపోవడంతో ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో రు. 2 కోట్లు రాబట్టడం అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇక వచ్చే వారం వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, వెంకీ, నాగచైతన్య వెంకీ మామ రిలీజ్ అవుతుండడంతో ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు వస్తుందన్న ఆశలు లేవు. కార్తికేయ ఖాతాలో వరుసగా మూడో ప్లాప్ అయ్యిందనే అనుకోవాలి.