తమిళ మార్కెట్ వద్దంటున్న తెలుగు హీరోలు… కారణం అదేనా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆత్మాభిమానం అనే విషయంలో తమిళనాడు ముందు వరుసలో ఉంటుంది. వాళ్ళ వద్దకు ఎవరైనా వెళ్ళినా సరే వాళ్ళు చులకన గా చూస్తూ ఉంటారని ఒక రోజు రెండు రోజులు ఆదరిస్తారు గాని తర్వాత వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు వస్తాయని అంటూ ఉంటారు. అది సినిమాలకు కూడా వాళ్ళు వర్తింపజేస్తారని అంటున్నారు. తమిళంలో సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే అక్కడి హీరోలు మంచి మంచి సినిమాలు చేస్తూ… ఎలాంటి పాత్రను అయినా చెయ్యడానికి సిద్దంగా ఉంటారు. వారికి అభిమానులు కూడా ఎక్కువ.

అందుకే అక్కడి హీరోలకు ఆదరణ తెలుగులో కూడా ఎక్కువగా ఉంటుంది. తెలుగులో వాళ్ళ సినిమాలు మంచి వసూళ్లను సాధిస్తాయి. దీనితో తెలుగు హీరోలు కూడా కోలివుడ్ పై దృష్టి సారించారు. అయితే అక్కడి అభిమానులు మాత్రం తెలుగు సినిమాలను ఇష్టపడటం లేదని అంటున్నారు. తెలుగులో ఎంత స్టార్ హీరో అయినా సరే మాకు అనవసరం అనే భావనలో వాళ్ళు ఉన్నారట. తెలుగు వాళ్ళను చిన్న చూపు చూసే తమిళులు తెలుగు వారికి నటన రాదని… వాళ్లకు నటించడం తెలియదని… ఇక్కడ ఏ సినిమా అయినా చూస్తారు అనే భ్రమలో ఉండి… తమిళంలో సినిమాలు వాళ్ళు విడుదల చెయ్యాలని చూస్తున్నారని తమిళ అభిమానులు భావిస్తారట.

మహేష్ బాబు, అల్లు అర్జున్, చిరంజీవి వంటి హీరోల సినిమాలకు అక్కడ ఆదరణ రాలేదు. దీనితో… టాలివుడ్ అగ్ర హీరోలు ఇప్పుడు కోలివుడ్ వైపు చూడటం మానేసారట. తెలుగు అభిమానుల మాదిరి వాళ్ళు సినిమాలను ఆదరించరని, వాళ్లకు అహం ఎక్కువని… అక్కడ సినిమాను ప్రమోట్ చేయడం కంటే కన్నడంలో, మలయాళంలో ప్రమోట్ చేయడం మంచిది అనే భావనలో ఉన్నారట మన స్టార్ హీరోలు. అందుకే ఇప్పుడు అక్కడ సినిమాలు విడుదల చేస్తామని నిర్మాతలు వచ్చినా సరే మన నిర్మాతలు అభిమానుల కారణంగా నో చెప్పెస్తున్నారట.

Share.