నానీ దెబ్బకు నిర్మాతలు భయపడుతున్నారా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

నానీ” సహాయ దర్శకుడిగా సిని కెరీర్ ప్రారంభించి… నేడు అగ్ర హీరో అనే గుర్తింపు తెచ్చుకునే స్థాయికి వెళ్ళాడు. వరుస విజయాలతో టాలివుడ్ లో ఏ స్టార్ హీరోకి అందని రికార్డ్ ని అందుకున్నాడు నానీ. ఇక నిర్మాతలకు లోబడ్జెట్ సినిమాలు నిర్మించి హిట్ లు ఏ విధంగా కొట్టాలో నానీ చెప్పేసాడు. ఇక తనతో సినిమా అంటే ఏళ్లకు ఏళ్ళు ఎదురు చూడాల్సిన అవసరం లేదని, సినిమా త్వరగా పూర్తి చేస్తాను అని చెప్పేసాడు నాని. దీనితో తక్కువ బడ్జెట్ తో సినిమా చెయ్యాలి అనుకునే నిర్మాతలు ఆయన వెంట పడ్డారు…

దీనితో ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేసాడు నానీ. ఇటు ఫాన్స్ కూడా నానీకి భారీగానే పెరిగారు. ఇప్పుడు ఇదే నానీకి ఆయన గురించి ఆయన ఎక్కువగా ఊహించుకునే స్థాయికి తీసుకు వెళ్ళింది అంటున్నారు సిని పరిశీలకులు. నానీతో సినిమా చెయ్యడమే నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తనకు నచ్చిన హీరోయిన్ అయితేనే నానీ సినిమా చేస్తున్నాడట. లేకపోతే మాత్రం చేసేది లేదని మొహం మీదే చెప్పెస్తున్నాడట ఈ యువ హీరో. అదే విధంగా షూటింగ్ సమయంలో నానీ వచ్చినప్పుడే షూటింగ్ మొదలుపెట్టాలని అది ఏ నిర్మాత అయినా అంతే అని అంటున్నారు. ఇక హీరోయిన్లతో అతను దురుసుగా ప్రవర్తిస్తాడని నాని చెప్పిన సమయానికే వాళ్ళు కూడా రావాలని, కాళీ గా ఉన్నా సరే డేట్స్ ఇవ్వడానికి ఇష్టపడడని అంటున్నారు.

ఇటీవల నానీపై ఐటి దాడులు జరిగాయి. ఈ ఐటి దాడుల సమయంలో కొంత మంది నిర్మాతలు హర్షం వ్యక్తం చేసారట. చాలా మంది అయితే నానీ తో సినిమా అంటే దూరంగా ఉంటున్నారని సమాచారం. అతను ఇలాగే ఉంటే భవిష్యత్తు కష్టమని ఎవరూ దగ్గరకు కూడా రానివ్వరని అంటున్నారు

Share.