థ‌మ‌న్ మాకొద్దు బాబోయ్ అంటోన్న స్టార్ హీరోలు..

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలివుడ్ యువ సంగీత దర్శకులలో థ‌మన్ ఒకరు… తక్కువ కాలంలోనే ఆయన స్టార్ హీరోలతో సినిమా చేసి స్టార్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆయన మ్యూజిక్ కి మంచి మార్కెట్ ఉండటంతో దర్శక నిర్మాతలు సైతం ఆయన వెంట పడిన రోజులు కూడా ఉన్నాయి. ఇక తనకు ఉన్న పలుకుబడితో కూడా కొన్ని సినిమాలు చేసాడు థ‌మన్. యూత్ ఏం కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా తెలిసిన ఈ యువ సంగీత దర్శకుడు అందుకు తగిన విధంగా సంగీతాన్ని అందిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇదే క్రమంలో అతనిపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. చిరంజీవి రీఎంట్రీ సినిమాలో ఒక కీలక సీన్ లో వచ్చే మ్యూజిక్ ని సుల్తాన్ సినిమా నుంచి కాపి చేసాడు థ‌మన్. అంతకు ముందు కూడా పాత పాటల్లో ఉన్న మ్యూజిక్ ని కాపీ చేసి అటు ఇటు చేసి కొడుతూ ఉండేవాడు. ఇది గమనించి అతనిపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్ కూడా భారీగానే చేశారు.

ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో సామజవరగమనా పాటలో మ్యూజిక్ కూడా బాలీవుడ్ సినిమాల్లోది కాపీ చేసాడని అభిమానులు ఆరోపించారు. దీనితో ఇప్పుడు స్టార్ దర్శకులు అతనితో సినిమా చెయ్యాలి అంటే ఆలోచిస్తున్నారు. స్టార్ హీరోలు కూడా థ‌మన్ సినిమాను ఇష్టపడటం లేదట. ఇక పాత సినిమాల్లో పాటలను రీమేక్ చేసి బలవంతంగా దర్శక నిర్మాతలను ఒప్పించే కార్యక్రమం చేస్తున్నాడట థ‌మన్.

దీనిపై సీనియర్ గాయకులూ అతనికి అలాంటివి చేయొద్దని సలహా ఇచ్చినా అతనిలో మార్పు రాలేదట. దీనితో ఇప్పుడు థ‌మన్ సంగీత సారధ్యంలో సినిమా అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారట దర్శక నిర్మాతలు. కాపీ మ్యూజిక్ ఉంటే మాత్రం ఇంకొకరిని తీసుకుంటామని కూడా చెప్పినట్టు ఫిలి౦ నగర్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.

Share.