షాద్ నగర్ లో జరిగిన దిశ హత్య, అత్యాచార ఘటనపై ఇప్పటికే సిని రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యంతో పాటు, చట్టాల్లో మార్పులు తీసుకు రావాలని సిని ప్రముఖులు కోరుతున్నారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని, భవిష్యత్తులో ఇలాంటివి చెయ్యాలి అంటే భయపడాలని కొందరు అంటుంటే… మరికొందరు కన్నీరు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో యువ హీరో విజయ్ దేవరకొండ అత్యాచారాలకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ చేసారు సోషల్ మీడియాలో. ఇప్పుడు దీనిపై అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.
“హలో విజయ్… ఈ పోస్ట్ పక్కన పెట్టి మాట్లాడుకుందా౦… అర్జున్ రెడ్డి మూవీ లో లేడీస్ ని ఎలా చూపించావు. ఓపెన్ చేస్తే ఫస్ట్ సీన్ ఏంటి…? ఫ్రెండ్ కి ఫోన్ చేసి పిలిస్తే వస్తదా రా అని నీ క్యారెక్టర్ ఎలివేషన్ ఏంటి విజయ్…? సమాధానం చెప్పగలవా…? ఐస్ గడ్డలు లోపల వేసుకోవడం ఏంట్రా హౌలా గాడి లాగా ఎవడైనా వేసుకుంటాడా…? ఈ సీన్లు చూసి టీనేజ్ పొరగాళ్ళు చేసే పనులకు మళ్ళీ నువ్వే ట్వీట్స్ వేయటం. నిన్ను కూడా వాళ్ళతో పాటు అరెస్ట్ చెయ్యాలి అసలు… అంటూ తీవ్ర స్థాయిలో విజయ్ లక్ష్యంగా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
ఇక ఆడవాళ్ళను ఎంత చులకనగా ఆ సినిమాలో చూపించారో నువ్వు మర్చిపోయావా…? అమ్మాయితో సిగరెట్ పట్టుకోవడం, దియా శర్మ అనే హీరోయిన్ తో నువ్వు ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటలు, ఇక లేడీ డాక్టర్స్ తో నువ్వు హాస్పటల్ చేసిన సీన్లు… ఇవన్ని పెట్టుకుని ఒక వరస్ట్ సినిమా తీసి ఇప్పుడ సోషల్ మీడియాలో నీతులు చెప్తున్నావా అంటూ విజయ్ పై అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. దయచేసి ఇలాంటి నీతులు నువ్వు చెప్పే ముందు… అమెజాన్ ప్రైమ్ లో ఆ సినిమా చూడు అంటూ సూచిస్తున్నారు.