ఇన్నాళ్లు తెలుగు, తమిళ ఆడియెన్స్ ను అలరిస్తున్న హీరోయిన్ కాజల్ ఇప్పుడు శాండల్ వుడ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతుంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా తెరకెక్కుతున్న కబ్జా సినిమాలో కాజల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమాతో కాజల్ కన్నడ పరిశ్రమలో అడుగుపెడుతుంది. సౌత్ లో క్రేజీ స్టార్స్ గా ఉన్న త్రిష, నయనతార ఇద్దరు కన్నడలో నటించారు.
అయితే వాళ్లిద్దరు అక్కడ పెద్దగా క్లిక్ అవలేదు. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న త్రిష, నయన్ లనే కన్నడ ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయలేదు. మరి కాజల్ కు అక్కడ ఎలాంటి ఫాలోయింగ్ ఏర్పడుతుందో చూడాలి. తెలుగు, తమిళ భాషల్లో దశాబ్ధం కాలం పైగా కెరియర్ సాగిస్తున్న కాజల్ ప్రస్తుతం సీనియర్ స్టార్స్ కు పర్ఫెక్ట్ పెయిర్ గా చేస్తుంది.
ఖైది నంబర్ 150 ముందు కెరియర్ దాదాపు ముగిసింది అనిపించగా.. ఆ సినిమా హిట్ తో మళ్లీ కెరియర్ ఊపందుకుంది. కేవలం స్టార్ హీరోలతోనే కాదు ఈమధ్య యువ హీరోలతో జత కట్టేందుకు సై అంటుంది కాజల్. మరి అమ్మడు చేస్తున్న ఈ క్రేజీ అటెంప్ట్ ఆమెకు ఎలాంటి క్రేజ్ తెచ్చి పెడుతుందో చూడాలి.