కార్తీ ‘ ఖైదీ ‘ క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌… రెట్టింపు లాభాలు..

Google+ Pinterest LinkedIn Tumblr +

చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు తెలుగులో సూప‌ర్ హిట్ కొట్టాడు కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ. ఊపిరి, ఖాకీ సినిమాల త‌ర్వాత కార్తీ న‌టించిన ఈ ఖైదీ అత‌డికి తెలుగులో మార్కెట్ ప‌రంగా మంచి ఊపిరి లూదింది. ఈ సినిమా బ‌య్య‌ర్ల‌కు డ‌బుల్ లాభాలు తెచ్చిపెట్టింది. కేవలం మూడున్నర కోట్లు పెట్టి కొన్న ఖైదీ తెలుగు వెర్షన్ కు అక్షరాలా 7 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే రూపాయికి రూపాయి లాభం అన్నమాట.

ఇటీవ‌ల కాలంలో ఎలాంటి ప‌బ్లిసిటీ లేకుండా మౌత్ టాక్‌తో ఇంత బ్ర‌హ్మాండంగా ఆడిన సినిమా మ‌రొక‌టి లేదు. కార్తీకి వ‌రుస‌గా ప్లాపుల మీద ప్లాపులు రావ‌డంతో ఖైదీని మొదటి రోజు ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ మౌత్ టాక్ అద్భుతంగా ఉండడంతో, రెండో రోజు నుంచి జనాలు రావడం స్టార్ట్ చేశారు.

ఈ సినిమాకు పోటీగా అదే రోజు రిలీజ్ అయిన మ‌రో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ బిగిల్‌.. తెలుగులో విజిల్ సినిమా వ‌చ్చినా కూడా ఆ సినిమా కంటే ఖైదీకే ఎక్కువ లాభాలు వ‌చ్చాయి. ఖైదీ సినిమా క్లోజింగ్ క‌లెక్ష‌న్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 2.20 కోట్లు

సీడెడ్ – రూ. 0.90 కోట్లు

ఉత్తరాంధ్ర – 1.25 కోట్లు

ఈస్ట్ – 0.50 కోట్లు

వెస్ట్ – 0.40 కోట్లు

గుంటూరు – 0.70 కోట్లు

నెల్లూరు – 0.30 కోట్లు

కృష్ణా – 0.80 కోట్లు
————————–
టోట‌ల్ = 7.05 కోట్లు
————————-

Share.