టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తను కూడా ప్రేమలో ఓడిపోయానన్న విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తను సినిమాల్లోకి రాకముందు ఒకరిని ఇష్టపడ్డానని కాకపోతే అతనికి నేను.. నాకు అతాను సెట్ అవడని అనుకుని విడిపోయినట్టు చెప్పుకొచ్చారు. తనతో లైఫ్ కొనసాగించడం కష్టం అనిపించే అతన్ని దూరం చేసుకున్నా అన్నది రకుల్.
ఇక తనని ఓ స్టార్ హీరో సెక్స్ చేస్తానని అన్నాడని కాకపోతే అతను మర్యాదపూర్వకంగా అడిగాడని.. తాను కుదరదని చెప్పేసరికి సైలెంట్ అయ్యాడని అన్నది. అయితే అది కాస్టింగ్ కౌచ్ కిందకు రాదని తన పర్సనల్ ఇంట్రెస్ట్ వెళ్లబుచ్చాడని తను నో చెప్పగానే అతను తనని బలవంతం చేయలేదని అందుకే అతని పేరు బయటకు చెప్పలేదని అన్నది రకుల్.
ప్రస్తుతం తెలుగులో కన్నా అమ్మడికి హిందిలోనే వరుస అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, తమిళంలో పద్ధతిగా కనిపించిన రకుల్ అక్కడ రెచ్చిపోతుంది. హీరోయిన్ గానే కాదు బాలీవుడ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కోసం కూడా రకుల్ అదరగొట్టేలా గ్లామర్ షో చేస్తుంది.