ప్రేక్షకులకు నిద్ర పట్టకుండా చేయడమే వీళ్ల పని..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరోయిన్ ఛాన్స్ రావడమే ఆలస్యం తమలోని అందాలకు సరైన పని చెబుతారు క్రేజీ భామలు. సినిమాకు అవసరం ఉన్నా లేకున్నా గ్లామర్ షో చేసే భామలు కొందరైతే సినిమాలో చూపించడం కుదరకపోతే పర్సనల్ గా ఫోటో షూట్స్ అంటూ రెచ్చిపోయే అందాల భామలు మరికొందరు. వారు ఏం చేసినా ఎలా చేసినా తమని ఫాలో అవుతున్న ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను ఎంటర్టైన్ చేయడమే.

ఒకప్పుడు బాలీవుడ్ లో మాత్రమే ఉండే ఈ ఫోటో షూట్ కల్చర్ ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా కొనసాగుతుంది. బాలీవుడ్ టూ టాలీవుడ్ ఆఫర్లు అందుకుంటున్న కియరా అద్వాని పిచ్చెక్కించే అందాలతో పరువాలతో వల వేస్తుంది. ఇక ఫేడవుట్ అయిన చిరుత బ్యూటీ నేహా శర్మ కూడా ఈమధ్య హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. అమ్మడు రెచ్చిపోవడం చూస్తుంటే కచ్చితంగా త్వరలోనే క్రేజీ ఛాన్సులే అందుకునేలా ఉంది.

ఇక కేవలం ఫోటో షూట్స్ తో ఛాన్సులు అందుకున్న హాట్ భామలు ఉన్నారు. ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా వస్తున్న రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది కెతిక శర్మ. డబ్ స్మాష్ చేసి ఆడియెన్స్ ను అలరించిన ఈ చిన్నది హాట్ ఫోటో షూట్స్ తో మంచి ఐడెంటిటీ తెచ్చుకుంది. దాని వల్లే సినిమా ఛాన్స్ కూడా అందుకుంది. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా సరే హీరోయిన్స్ మాత్రం హాట్ ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ కు మంచి ట్రీట్ ఇస్తున్నారు.

Share.