మాములుగా అయితే హీరోయిన్స్ అంటే ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే చేసే అవకాశం ఉంటుంది. కాని కొంతమంది మాత్రం అన్నిటిని చేసేందుకు సిద్ధంగా ఉండరు. కొందరు హీరోయిన్స్ కేవలం పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తారు. కాని కొందరు మాత్రం గ్లామర్ షోకి రెడీ అంటారు. హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్నాక వాణిజ్య ప్రకటనలు చేస్తూ సంపాదిస్తారు భామలు.
అయితే అలాంటివాటికి కొందరు దూరంగా ఉంటారు. లేటెస్ట్ గా అలాంటి ఆఫర్ ను కాదన్నది నాచురల్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి. మళయాళ ప్రేమంతో మెప్పించిన ఈ చిన్నది తెలుగులో ఫిదా అంటూ వచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. కేవలం సినిమాల్లో అది కూడా సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్న సాయి పల్లవి వాణిజ్య ప్రకటనలు చేసే అవకాశం వచ్చినా సరే చేయనని చెప్పిందట.
ఫిదా టైంలోనే ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చే యాడ్ ఛాన్స్ వచ్చినా చేయనని చెప్పిన సాయి పల్లవి లేటెస్ట్ గా మరో బడా బ్రాండ్ ఆఫర్ ను తిరస్కరించిందట. సాయి పల్లవికి కోటి రూపాయల ఆఫర్ ఇచ్చినా సరే తను యాడ్స్ చేయనని చెప్పి షాక్ ఇచ్చిందట సాయి పల్లవి. వచ్చిన ఛాన్స్ అల్లా చేసుకుంటూ వెళ్లి రెండు చేతులా సంపాదించే హీరోయిన్స్ ఉన్న ఈరోజుల్లో సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ చాలా అరుదని చెప్పొచ్చు. మరి ఈ అమ్మడు ఇలానే కెరియర్ కొనసాగిస్తుందా లేక తర్వాత మారుతుందా అన్నది చూడాలి.