ఎన్.టి.ఆర్ మేనేజర్ బ్లాక్ మెయిల్..నందమూరి ఫ్యాన్స్ ఫైర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కళ్యాన్ రాం హీరోగా అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి ఎన్.టి.ఆర్ తో అశోక్, ఊసరవెల్లి సినిమాలు చేశాడు. రీసెంట్ గా సైరాను డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి ఎన్.టి.ఆర్ మేనేజర్ తనని బ్లాక్ మెయిన్ చేశాడన్న విషయాన్ని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. అతనొక్కడే సినిమా తర్వాత సురేందర్ రెడ్డి ప్రభాస్ తో సినిమా చేయాలని అనుకున్నాడట. కాని ఎన్.టి.ఆర్ మేనేజర్ బ్లాక్ మెయి చేసి తారక్ తో సినిమా ప్లాన్ చేశాడట.

అశొక్ సినిమాకు ముందు జరిగింది ఇదే అంటూ సురేందర్ రెడ్డి చెప్పడం నందమూరి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తారక్ అశోక్ ఫ్లాప్ అయినా సరే సురేందర్ రెడ్డికి ఊసరవెల్లి ఛాన్స్ ఇచ్చాడని ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఎన్.టి.ఆర్ మేనేజర్ మీద నిందలు వేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి మీద నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహ జ్వాలలతో సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి.

సురేందర్ రెడ్డి ఎందుకు అలాంటి కామెంట్స్ చేశాడు. అసలు ఆ వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వీడియో బైట్ చూసి సూరిపై నందమూరి ఫ్యాన్స్ ట్రోల్స్ ఎక్కువయ్యాయి. సైరా తర్వాత ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు సురేందర్ రెడ్డి. ఈమధ్యనే కథ సిద్ధం చేసుకోగా ప్రభాస్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

Share.