బాక్సఫీస్ వద్ద నాని..నాగచైతన్యం పోటీపడటం మరోసారి ఖాయంగా కనిపిస్తోంది. గతంలో క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన జెర్సీతో నాని…మజిలీ సినిమాతో నాగచైతన్య కలెక్షన్లలో పోటీపడ్డారు. అయితే జెర్సీ ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు పబ్లిక్‌లోనూ మంచి పాజిటివ్ టాక్ వినబడింది. అయితే కలెక్షన్ల విషయానికి వచ్చేసరికి మాత్రం మజిలీ కన్నా చాలా వెనకబడిపోయింది. జెర్సీలో నాని భావోద్వేగాన్ని పండిస్తే…నాగచైతన్య తన నటనను మెరుగు పర్చుకుని ఫెయిల్యూర్ లవ్‌స్టోరీలో అద్భుత నటనను ప్రదర్శించాడు.
నాగచైతన్య సమంత పెళ్లి తర్వాత వచ్చిన చిత్రమవడంతో ప్రేక్షకులను థియేటర్లకు వెళ్లేలా చేసింది.
అదే సమయంలో జెర్సీలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సవగా ప్రేక్షకులకు మజిలీలో కనిపించాయి. దీంతో ప్రేక్షకులు మజిలీ వైపు ఎక్కువగా మొగ్గు చూపడానికి కారణమయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది ఈసినిమా. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఈ యంగ్ హీరోల సినిమాలు మళ్లీ ఒకేసారి విడుదలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలో నాగచైతన్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఈ డిసెంబర్లోనే విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ వెంకీ మామ డిలే అవడంతో ఆ చిత్రాన్ని వేసవికి వాయిదా వేసారు. నాని సినిమా ‘వి’ వచ్చే ఏడాది మార్చిలో ఉగాదికి విడుదల కానుందని ఇప్పటికే చిత్రవర్గాలు ప్రకటించాయి. ఇక శేఖర్ కమ్ముల పనైపోయిందని అనుకున్న వాళ్ల నోళ్లను మూయించాడు ఫిదా కలెక్షన్లతో నోరుమూయించాడు స్మార్ట్ అండ్ సైలెంట్ డైరెక్టర్. ఫిదా తర్వాత శేఖర్ కమ్ములతో సాయి పల్లవి చేస్తోన్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి.
నాని సినిమా సోలోగా వచ్చినట్టయితే వేసవిలో ముందుగా వచ్చే అడ్వాంటేజ్‌ని క్యాష్ చేసుకోగలుగుతుంది. అదే చైతన్య సినిమాతో పోటీ ఏర్పడితే మాత్రం బాక్సాఫీస్ లెక్కలు మారిపోతాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. మరి ఇద్దరు హీరోలు పోటీ పడతారా.? లేదంటే చిత్రాలను ఎవరు వాయిదా వేసుకోబోతున్నారు అనే విషయం తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.