తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్ గా నటిస్తున్న నిక్కి గర్లాని తెలుగులో పెద్దగా పాపులారిటీ సంపాదించలేదు కాని కన్నడ, తమిళ భాషల్లో క్రేజ్ తెచ్చుకుంది. మాత్రు భాష కన్నడలో వరుస ఛాన్సులు అందుకుంటున్న ఈ అమ్మడు కోలీవుడ్ సినిమాలను చేస్తూ వస్తుంది. అయితే లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిక్కి తను లవ్ లో ఉన్న విషయాన్ని చెప్పుకొచ్చింది.
చెన్నైలో తను ప్రేమలో పడ్డానని.. ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతానని అంటుంది నిక్కి గర్లాని. అంతేకాదు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేసి మరో మూడేళ్ల తర్వాతనే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది నిక్కి. లవర్ ఉన్నాడన్న విషయాన్ని చెప్పడమే కాకుండా అతన్నే పెళ్లాడుతా అని బాహాటంగా చెప్పిన నిక్కి గట్స్ ను మెచ్చుకుంటున్నారు.
అయితే తను ప్రేమించిన వ్యక్తి పేరు.. అతని వివరాలు మాత్రం చెప్పలేదు నిక్కి గర్లాని. మరి అమ్మడి హృదయాన్ని దొంగిలించిన ఆ ప్రేమ దొంగ ఎవరో తెలియాక్ల్సి ఉంది. మూడేళ్ల దాకా సినిమాలు చేసి ఆ తర్వాత పెళ్లే అంటుంది. మరి అమ్మడు తన ప్రేమికుడిని ఎప్పుడు బయటకు చూపిస్తుందో చూడాలి.