విప్పడానికి తాను సిద్ధమే అంటున్న హీరోయిన్..

Google+ Pinterest LinkedIn Tumblr +

మళయాళ భామ కీర్తి సురేష్ అంటే సౌత్ మొత్తం సూపర్ క్రేజ్ ఏర్పడింది. మహానటి ముందు వరకు ఆమె మంచి నటి అనిపించుకున్నా మహానటి తర్వాత మరో సహజ నటిగా మారారు. అయితే తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ ఇప్పటివరకు గ్లామర్ షో విషయంలో వెనక్కి తగ్గుతూ వచ్చింది. కథానాయిక ప్రాధాన్యత పాత్రల్లో మాత్రమే నటిస్తూ వచ్చిన ఈ అమ్మడు స్కిన్ షోకి ఆమడం దూరం ఉంటూ వచ్చింది.

అయితే కొన్నిసార్లు అవకాశాల కోసం కట్టుబాట్లు దాటాల్సి ఉంటుంది. కీర్తి సురేష్ కూడా అదే చేయాలని చూస్తుంది. ఇప్ప్టివరకు అభినయంతోనే ఆకట్టుకున్న కీర్తి సురేష్ ఇక అందంతో మత్తులు చల్లాలని చూస్తుంది. కీర్తి లాంటి హీరోయిన్ ఎక్స్ పోజ్ చేయడం మొదలుపెడితే ఆడియెన్స్ తట్టుకోవడం కష్టమే. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇక మీదట హాట్ గా కనిపించాలని అనుకుంటుందట.

గ్లామర్ పాత్రలకు తాను ఎప్పుడూ సిద్ధమే అంటుంది కీర్తి సురేష్. ఇన్నాళ్లు తనకు అలాంటి ఛాన్సులు రాలేదని వస్తే తప్పకుండా చేస్తానని అంటుంది అమ్మడు. ఇన్నాళ్ లు దాచిపెట్టిన అందాలను కీర్తి బయటపెట్టనుందని చెప్పొచ్చు. కీర్తి సురేష్ ఒకవేళ అలా ఫిక్స్ అయితే మాత్రం ఇక మిగతా హీరోయిన్స్ కు ఛాన్సులు రావడం కష్టమే.

Share.