తనకు రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో మరోసారి బాలయ్య నటించబోతున్నాడు. సింహా, లెజెండ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ప్రస్తుతం బాలయ్య – కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూరల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 20న వస్తోంది. ఈ సినిమా అయిన వెంటనే బాలయ్య, బోయపాటితో జాయిన్ అవుతాడు.
ఈ మేరకు ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయి. బ్యానర్ కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి వరుసగా క్రేజీ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. బాలయ్య సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ ను అనుకుంటున్నారట. సంజయ్ దత్ పాత్ర చాలా భయంకరంగా ఉంటుందని టాక్.
మరోవైపు ఈ సినిమాలో కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన రచితా రామ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. త్వరలోనే ఆమె పేరును అధికారికంగా ప్రకటించబోతున్నారు. 27 ఏళ్ల రుచిత 60 ఏళ్లకు దగ్గరైన బాలయ్యతో రొమాన్స్‌కు రెడీ అవుతోంది. ఇక మరో హీరోయిన్ కోసం ఇలియానా పేరు పరిశీలనలో ఉందట. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేస్తారు.