క్యాస్ట్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన శ్రీరెడ్డి..

Google+ Pinterest LinkedIn Tumblr +

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో వుండే శ్రీరెడ్డి త‌న తాజా వ్యాఖ్య‌ల‌తో త‌న‌కున్న క్యాస్ట్ ఫీలింగ్‌ను బ‌య‌ట పెట్టుకున్న‌ట్ల‌య్యింద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. తాజాగా శ్రీరెడ్డి ప‌వ‌ర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే ట్రాన్స్ జెండ‌ర్ త‌మ‌న్నా అత‌డికి స‌పోర్ట్ చేసింద‌ని… సింహాద్రికి కాపు కోణంలోనే చిరంజీవి మద్దతు పలికారనీ శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది.

ఇక శ్రీరెడ్డి మెగా కాంపౌండ్ మీద ఎప్ప‌టి నుంచో ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తోంది. ఇక ఇప్పుడు మెగా కాంపౌండ్‌కు క్యాస్ట్ ఫీలింగ్ అంట క‌ట్టేసింది. ఇక చిరంజీవికి అత్యంత సన్నిహితులుగా పేరొందిన చాలామంది ప్రముఖులు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందినవారే. ఆయ‌న వియ్యంకుళ్లు కూడా రెడ్డి, క‌మ్మ‌లే కావ‌డం విశేషం.

చిరుకు ఆప్తులు అయిన శ్రీకాంత్‌, ర‌వితేజ ఇలా వీళ్లంతా వేర్వేరు కులాల‌కు చెందిన వారు. ఇక గ‌తంలో కూడా ఎన్నిక‌ల టైంలో శ్రీరెడ్డి ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న త‌ల్లి మీద కూడా జుగుస్సాక‌ర‌మైన ఆరోప‌ణ‌లు చేసింది. అప్పుడే ఆమెపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ఆమెకు ఉన్న కుల పిచ్చి కూడా బ‌య‌ట పెట్టుకుని మెగా కాంపౌండ్‌కు కుల గ‌జ్జి అంటించే ప్ర‌య‌త్నం చేసింద‌ని అనుకోవాలేమో…?

Share.