కోలీవుడ్ సింగర్ కం హీరోయిన్ ఆండ్రియా తన లైఫ్ లో జరిగిన ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. తను ఓ పెళ్లైన వాడితో అక్రమ సంబందం పెట్టుకున్నా అని చెప్పిన ఆండ్రియా అతని నుండి దూరంగా వెళ్లేందుకు చాలా కష్టపడ్డానని అన్నది. అంతేకాదు ఆ సమయంలో తాను ఎంతో మానసిక ఆవేదనకు గురయ్యానని చెప్పొకొచ్చింది ఆండ్రియా.
అయితే తను రిలేషన్ ఏర్పరచుకున్న వ్యక్తి పేరుని మాత్రం బయటపెట్టలేదు ఆండ్రియా. తన జీవితంలో జరిగిన విషయాల మీద ఓ బుక్ రాస్తున్నానని అందులో అతని పేరు రివీల్ చేస్తానని చెప్పారు ఆండ్రియా. అయితే ఇప్పటికే బుక్ రాయడం పూర్తయినా ఆ వ్యక్తి తన పలుకుబడితో ఆండ్రియా బుక్ ప్రింట్ అవకుండా అడ్డుపడుతున్నాడట.
అయితే ఎలాగైనా సరే ఆండ్రియా ఆ బుక్ ను రిలీజ్ చేసి అతని పరువు బజారున పడేయాలని చూస్తుంది. హీరోయిన్ గా మంచి పీక్స్ లో ఉన్నప్పుడే అతనితో రిలేషన్ వల్ల వచ్చిన ఛాన్సులు మిస్సైంది ఆండ్రియా. రీ ఎంట్రీలో పెద్దగా అవకాశాలు రాకున్నా తనకు వచ్చిన ఛాన్సులను చేస్తూ కెరియర్ వెళ్లదీస్తుంది అమ్మడు.