హాట్ దిశాను ఒళ్లు హూనం చేసిన డైరెక్ట‌ర్‌…

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ బికిని గాళ్‌గా దిశా ప‌టానీకి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తెలుగులో కూడా మెగా హీరో వ‌రుణ్‌తేజ్ లోఫ‌ర్ సినిమాతో న‌టించిన దిశాకు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన ఫాలోయింగ్ క‌న్నా ఆమె హాట్ ఫొటో షూట్ల‌తో వ‌చ్చిన క్రేజే ఎక్కువ‌. హాట్ ఫొటో షూట్ల‌తో దిశాకు వ‌చ్చిన భీభ‌త్స‌మైన క్రేజ్‌తో ఇప్పుడు ఆమెకు వ‌రుస పెట్టి స్టార్ హీరోలు ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ఇస్తున్నారు.

బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ తో భారత్ సినిమాలో నటించిన దిశా పటాని ప్రభుదేవ డైరక్షన్ లో సల్మాన్ నటిస్తున్న రాధే సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ప్ర‌భుదేవా దిశాతో ఆమె ఒళ్లు అంతా కూసాలు క‌దిలిపోయే రేంజ్‌లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించాడ‌ట‌. ప్ర‌భుదేవా డ్యాన్స్ మూమెంట్స్‌కు నా ఒళ్లు అంతా హూనం అయ్యింద‌ని ఆమె చెపుతోంది.

ప్ర‌భుదేవా డ్యాన్స్ మాస్ట‌ర్ & డైరెక్ట‌ర్ కావ‌డంతో అటు యాక్ష‌న్‌, ఇటు డ్యాన్స్ రెండు ప‌ర్పెక్ట్‌గా ఉండాల‌ని అనుకుంటాడు. ఈ క్ర‌మంలోనే దిశాతో చాలా సంక్లిష్ట‌మైన స్టెప్పులు వేయించాడ‌ట‌. ఈ స్టెప్పులు ప్రాక్టీస్ చేయించేందుకే చాలా అల‌సిపోయింద‌ట‌. అందుకే ప్రభు మాస్టర్ కాంప్ర‌మైజ్ కాకుండా ఒళ్లు హూనం అయ్యేలా ప్రాక్టీస్ చేయిస్తున్నాడని ఫోటో పెట్టి కూడా పెట్టింది.

ఆ ఫొటో చూస్తేనే ఆమెను ప్ర‌భుదేవా త‌న స్టెప్ మూమెంట్ల‌తో ఎంత ఒళ్లు హూనం చేశాడో అర్థ‌మ‌వుతోంది. ప్ర‌భు అటు సల్మాన్ తో పాటుగా దిశా పటానితో కూడా హార్డ్ ప్రాక్టీస్ చేయిస్తున్నాడట. భారత్ సినిమాలో సల్మాన్, దిశా సాంగ్ స్టెప్పులు అదిరిపోయాయి. అందుకే ఈ కాంబోలో మళ్లీ అదరగొట్టే స్టెప్పులు రావ‌డం ఖాయం.

Share.