మ‌హేష్ ఫామిలీ లో మరో స్టార్ హీరో ఎంట్రీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు, అమ‌రరాజా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గల్లారామచంద్ర నాయుడి మనవడు,గుంటూరు ఎంపీ జయదేవ్‌ కుమారుడు అయిన గల్లా అశోక్‌ త్వరలో టాలీవుడ్‌కు హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. కొద్ది రోజులుగా గ‌ల్లా అశోక్ వెండి తెరంగ్రేటం గురించి చ‌ర్చ‌లు న‌డిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా ఆయ‌న సినిమా ఈ నెల 10 లాంచ్ కాబోతున్న విష‌యాన్ని ప్ర‌ముఖ బాలీవుడ్ ట్రేడ్ ఎన‌లిస్ట్ త‌రుణ్ ఆద‌ర్శ్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించాడు.

ఇక సినిమా రంగంపై ఇంట్ర‌స్ట్‌తో ఉన్న అశోక్ కొద్ది రోజులుగా శిక్ష‌ణ కూడా పొందుతున్నాడు. ముందుగా ఈ రంగంలో అనుభ‌వం కోసం మ‌హేష్‌బాబు కొర‌టాల శివ కాంబోలో వ‌చ్చిన శ్రీమంతుడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కూడా వ‌ర్క్ చేశాడు. ఇక దీంతో పాటు భ‌ర‌త్ అనే నేను సినిమాకు కూడా కొంత కాలం ప‌నిచేశాడు. ఇక ఇప్పుడు వెండితెర‌కు హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు.

గ‌తంలోనే అశోక్ హీరోగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో ప్రారంభ‌మైన సినిమా ఆగిపోయింది. ఇక శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను గల్లా జయదేవ్ భార్య ప‌ద్మావ‌తి నిర్మిస్తార‌ని తెలుస్తోంది. ముందుగా సినిమా స్క్రిఫ్ట్‌ను కాణిపాకం వ‌ర‌సిద్ధి వినాయ‌కుని స‌మ‌క్షంలో ఉంచి సినిమా విజ‌యం సాధించాల‌ని పూజ‌లు చేశారు.

Share.