మద్యం మత్తులో స్నేహితుడి భార్యరే రేప్ చంపేశాడు ఓ మృగాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూర్ గ్రామానికి చెందిన మహిళ ఉదయాన్నే మాదాపూర్‌లోని తమ పొలానికి వెళ్లింది. ఇక ఆ మహిళ
భర్త తన స్నేహితుడు చెక్కిల్ల శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మధ్యాహ్నం నుంచి వడ్లూర్ గ్రామంలోని బెల్ట్ షాప్‌లో మద్యం తాగసాగాడు.
సాయంత్రం 4 గంటలకు తన భార్యను తీసుకురమ్మంటూ శ్రీనివాస్ గౌడ్‌కు ద్విచక్ర వాహనం ఇచ్చి పంపాడు. అప్పటికే మత్తుతో మదమెక్కిన శ్రీనివాస్ గౌడ్ మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా ఆ విషయం బయట పడుతుందని ఆ నిస్సహాయురాలిని దారుణంగా కడతేర్చాడు. తన స్నేహితుడి భార్యను మొక్కజొన్న చేలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి, అనంతరం గొంతు నులిమి చంపేశాడు.
బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి చెందిన ఎల్లాల లచ్చిరెడ్డి, లచ్చవ్వ (45) దంపతులకు మాదాపురం శివారులో వ్యవసాయ భూమి ఉంది. లచ్చిరెడ్డికి స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తున్న చెక్కిల శ్రీనివాస్ గౌడ్‌తో కొంత కాలంగా సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి తిరిగేవారు. కలిసి మద్యం సేవించే వారు. ఈ క్రమంలోనే సోమవారం ఇద్దరు మద్యం తాగారు. తన భార్యను తీసుకురావాలని బైక్ ఇచ్చి శ్రీనివాస్ గౌడ్‌ను పంపాడు.
లచ్చిరెడ్డి వ్యవసాయ భూమి వద్దకు వెళ్లిన శ్రీనివాస్ గౌడ్ కాసేపటి తర్వాత తన తండ్రి స్వామికి ఫోన్ చేసి లచ్చవ్వ మొక్కజొన్న చేనులో చనిపోయి ఉందని తెలిపాడు. స్వామి ఆ విషయాన్ని కొంత మంది గ్రామస్థులకు చెప్పాడు. సమాచారం అందుకున్న లచ్చిరెడ్డి గ్రామస్థులతో కలిసి బావి వద్దకు వెళ్లి అక్కడ దృశ్యం చూసి కుప్పకూలిపోయాడు. చివరకు శ్రీనివాస్ గౌడ్ మద్యం మత్తులో ఆమెను చంపేశాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు.