తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వరని కామెంట్స్ ఒకప్పుడు బాగా వినపడేవి. అయితే ఇప్పుడు సీన్ మారింది. టాలెంట్ ఉంటే అవకాశం వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు అమ్మాయిగా తెలుగు సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్న భామ ఈషా రెబ్బ. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈషా వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది.
అరవింద సమేత సినిమాలో తారక్ తో కలిసి నటించిన ఈషా రెబ్బ ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి డైరక్షన్ లో రాగల 24 గంటల్లో సినిమాలో నటించింది. ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. సినిమాలో ఈషా రెబ్బ హాట్ లుక్స్ తో కనిపించింది. పెళ్లి తన భర్తతో ఓ బంగ్లాలో ఉంటున్న ఈషాకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది.
ఈ సినిమాలో ఈషా రెబ్బ మరో సైడ్ కనిపించిందని చెప్పొచ్చు. సినిమాలో హౌజ్ వైఫ్ గా నటించినా తన హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. మడికట్టుకు కూర్చుంటే అవకాశాలు రావడం లేదు అందుకే ఈషా రెబ్బ ఇప్పుడు గ్లామరస్ గా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మరి ఈషా తీసుకున్న ఈ కొత్త టర్న్ ఆమె కెరియర్ కు ఏవిధంగా హెల్ప్ అవుతుందో చూడాలి.