ప్రభాస్ కోసం రైలు రెడీ…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రభాస్ కోసం రైలు రెడీ…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం ఓ ప్రత్యేక రైలు రెడీ అయింది. సాహో సినిమా బిజీతో సేద తీరేందుకు సెలవులపై వెళ్ళిన ప్రభాస్ సెలవులు ముగించుకుని తదుపరి ప్రాజెక్టులో జాయిన్ అయ్యేందుకు సిద్దమవుతున్నారు. ఈ తరుణంలో ప్రభాస్ కోసం ఓ రైలునే సిద్దం చేసి పెట్టింది చిత్ర యూనిట్. ఇంతకు ప్రభాస్ సెలవులు పూర్తి అయిన తరువాత రైలు ఎందుకు.. మరెటైనా టూర్కు ప్లాన్ చేశారా అనుకుంటున్నారా..అయినా ప్రభాస్ కోసమే ఓ ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాల్సినంత అవసరం ఏమిటీ.. అనుకుంటున్నారా..? అయితే చూడండి…

బాహుబలి సినిమా ఇచ్చిన ఇమేజ్తో ప్రభాస్ సాహోను రెండున్నర ఏండ్లు కష్టపడి పూర్తి చేశారు. కానీ బాలీవుడ్లో జోష్ నింపింది కానీ ఇతర ప్రాంతాల్లో డిజాస్టర్ అయింది. దీంతో సాహోతో సగం చచ్చిన ప్రభాస్ తదుపరి ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి నిలిపాడు. అందుకే ఇప్పుడు జాన్ సినిమా ( ఇది వర్కింగ్ టైటిల్ )లో నటిస్తున్నారు. ఈ సినిమా సాహో సినిమా షూటింగ్ పూర్తికాగానే 30శాతం షూటింగ్ పూర్తి చేసింది చిత్ర యూనిట్. అయితే మిగతా 70శాతాన్ని పూర్తి చేసేందుకు రంగం చేసింది చిత్ర యూనిట్.

ఈ చిత్ర షూటింగ్ ఒకరి రెండు రోజుల్లో తిరిగి పట్టాలెక్కించే పనిలో చిత్ర యూనిట్ ఉండగా, అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రభాస్ కోసం రెండు రైలు పెట్టెలను సిద్ధం చేసి పెట్టింది. పాతకాలం నాటి సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రైలు పెట్టెలు కూడా పాతకాలం లో ఉన్నట్లుగా రెడి చేసి పెట్టారు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్. ఈ సెట్లో దాదాపు 11రోజులకు పైగా షూటింగ్ జరుగుతుందని సమాచారం. అయితే ఇదే ప్రాంతంలో ప్రిన్స్ మహేష్బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో రైలు కు సంబంధించిన షెడ్యూల్ను ఇక్కడే షూటింగ్ చేశారు. ఇదే ప్రాంతంలో ప్రభాస్ కోసం కూడా ప్రత్యేక సెట్ వేయడం విశేషం. ఇక ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రాన్ని రెబల్స్టార్ కృష్టంరాజు సంస్థతో పాటుగా, యూవీ క్రియోషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తుంది.

Share.