అభిమానులని భయపెడుతున్న మెగా స్టార్ లుక్….

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమాకి తగ్గట్టుగా లుక్ ఛేంజ్ చేయడం మెగా స్టార్ చిరంజీవికి కొత్త ఏమి కాదు. ప్రతి సినిమాకు తన పాత్రకు తగ్గట్టుగా గెటప్స్ మారుస్తూ ఉంటారు. అయితే ఆయన సినిమాల్లో రీ ఎంట్రీ తర్వాత కొంచెం లావుగా కనిపిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150లో స్టైలిష్ లుక్ లో కనిపించిన, కొంత లావు ఉన్నారు. కానీ అది సినిమాకు సెట్ అయినట్లే అనిపించింది. ఇక ఇటీవల మెగాస్టార్ ‘సైరా’ సినిమాలో చారిత్రక పాత్రలో నటించారు. ఇందులో కూడా చిరంజీవి లావుగానే కనిపించారు.

కాకపోతే సినిమా చరిత్రకు సంబంధించినది కావడం, పాత్రకు తగ్గట్టుగా చిరంజీవిని రెడీ చేయడం వల్ల అంతగా లావు ఉన్న, పాత్రకు సరిపోయింది. దానికి తగిన విధంగా దుస్తులు ధరించడంతో ఓకే అనిపించింది. ఇక చిరంజీవి సైరా తర్వాత….కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ సన్నగా, స్టైలిష్ గా ఉండాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.

కానీ చిరంజీవి అందుకు తగ్గట్టుగా లేరని అనిపిస్తుంది. ఇటీవల మెగాస్టార్ బిగ్ బాస్-3 ఫైనల్ కి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన చేతుల మీదుగానే బిగ్ బాస్ విన్నర్ ని ప్రకటించారు. అయితే ఈ ఫైనల్ కి వచ్చినప్పుడు చిరంజీవి గెటప్ చూస్తుంటే, కొంత బరువు తగ్గినట్లే అనిపిస్తుంది. సైరా మీద పోలిస్తే కొంచెం బెటర్ గానే కనిపిస్తున్నారు. కానీ పెద్దగా లావు తగ్గినట్లు లేరు, పైగా ఫిట్ గా కూడా కనిపించడం లేదు.

అయితే మరికొన్ని రోజుల్లోనే కొరటాల శివ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇక బరువు విషయంలో ఇప్పటికిప్పుడు ఏం చేయడం కుదరదు కాబట్టి….ఇలాగే షూటింగ్ మొదలుపెట్టడానికి చూస్తున్నారు. ఇదే గెటప్ తో షూట్ చూస్తే ఎలా అని అభిమానులు కూడా కొంత ఆందోళన చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి ఇంకా కాస్త ఫిట్ గా ఉంటే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

Share.