హాలీవుడ్ లో మొదలైన మీటూ ఎఫెక్ట్ సౌత్ సిని పరిశ్రమకు చేరుకుంది.. సింగర్ చిన్మయితో పాటుగా హీరోయిన్ శృతి హరిహరణ్ కూడా ఈ విషయంలో తనకు జరిగిన వేధింపుల గురించి బయటపెట్టింది. శృతి హరిహరణ్ అర్జున్ పై లైంగిక వేధింపుల గురించి చేయగా దాని మీద విచారణ కూడా జరిగింది. ఇదిలాఉంటే మీటూ అంటూ వేధింపుల గురించి బయట పెట్టిన తర్వాత తనకు సినిమా అవకాశాలు తగ్గాయని చెబుతుంది శృతి హరిహరణ్.
తమ మీద జరిగిన లైంగిక ఆరోపణల మీద హీరోయిన్స్ బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉందని అంటుంది శృతి హరిహరణ్. అర్జున్ పై విమర్శలు చేయకముందు వరకు తనకు చాలా ఛాన్సులు వచ్చాయని.. కాని ఆ తర్వాత మాత్రం ఎవరు తన వంక కూడా చూడలేదని అంటుంది శృతి హరిహరణ్.
ఇటీవల ఓ డిస్కషన్స్ లో పాల్గొన్న శృతి మీటూ గురించి మాట్లాడేందికు సిగ్గు పడాల్సిన అవసరంలేదని.. హీరోయిన్స్ కు వారిపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడే హక్కు ఉందని.. దానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అంటుంది శృతి హరిహరణ్. స్టార్ హీరోయిన్స్ ఎవరు తమకు జరిగిన వేధింపుల గురించి బయట పెట్టడం లేదని వారు కూడా నోరు తెరిస్తే బాగుంటుందని అంటుంది శృతి.