పెళ్లి తర్వాత ఆ హీరోతో సై అంటున్న సమంత..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘V’ సినిమా చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. సుధీర్ బాబు కూడా ఈ సినిమాలో స్పెసల్ రోల్ ప్లే చేస్తున్నాడు. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపుదశకు చేరుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నాని షైన్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

నిన్ను కోరి, మజిలీ సినిమాలతో హిట్ అందుకున్న శివ నిర్వాణ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నానితో పాటుగా సమంత రొమాన్స్ కు రెడీ అవుతుంది. లవ్ స్టోరీస్ లోనే కొత్త యాంగిల్ లో సినిమా చేస్తున్న శివ నిర్వాణ 3వ సినిమాను కూడా హ్యాట్రిక్ హిట్ కోసం క్రేజీ కాంబినేషన్ సెట్ చేశాడు.

నానితో సమంత ఇంతకుముందు ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా చేసింది. సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకుండా అటు నాని ఇటు సమంత ఫ్యాన్స్ ను అలరించింది. ఇక ఇప్పుడు శివ నిర్వాణ లాంటి క్రేజీ డైరక్టర్ తో ఈ కాంబో రిపీట్ అవడంపై ఇద్దరి ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. తప్పకుండా ఈ మూవీ అదరగొడుతుందని అంటున్నారు. సమంత ప్రస్తుతం 96 మూవీ రీమేక్ లో నటిస్తుంది.

Share.