టాలీవుడ్‌లో ఈ శుక్రవారం మంచి అంచనాలు ఉన్న రెండు చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా, విజయ్ దేవరకొండ నిర్మాతగా తెరకెక్కిన మీకు మాత్రమే చెప్తా సినిమాతో పాటు రవిబాబు హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఆవిరి సినిమాలు రెండూ రిలీజ్ అయ్యాయి. దీపావళికి రెండు కోలీవుడ్ హీరోల సినిమాలు విజిల్, ఖైదీ రిలీజ్ కాగా ఇప్పుడు వారం గ్యాప్‌తో రెండు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఇక ఈ రెండు సినిమాల్లో మీకు మాత్రమే చెప్తా సినిమాకు ఓ మోస్తరు టాక్ వచ్చింది. కామెడీ బాగుందన్న టాక్ వచ్చినా… రవిబాబు ఆవిరి సినిమాకు మాత్రం డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇక తొలి రోజు వసూళ్లు చూస్తే రెండు సినిమాలు ఘోరాతి ఘోరంగా దెబ్బేశాయి. ఆవిరికి ఎలాగూ ప్లాప్ టాక్ వచ్చింది. కనీసం మీకు మాత్రమే చెప్తా అయినా ఓ మోస్తరు వసూళ్లు రాబడుతుందని అందరూ అనుకోగా.. ఆ సినిమాకు సైతం షాక్ తప్పలేదు.
ఇక ఆవిరి కేవలం 10 శాతం ఆక్యుపెన్సీతో స్టార్ట్ అవ్వగా… మీకు మాత్రమే చెప్తా సైతం కేవలం 25 శాతం ఆక్యుపెన్సీతో ప్రారంభమైంది. ప్రస్తుతం అంతా థియేటర్లలో సినిమాలకు నాన్ సీజన్ వాతావరణం నడుస్తోంది. మరో వైపు ఇంకా కోలీవుడ్ రీమేక్ సినిమాలు విజిల్, ఖైదీ థియేటర్లలో ఉన్నాయి. విజిల్ కాస్త స్లో అయినా ఖైదీ అన్ని చోట్లా చాలా స్ట్రాంగ్‌గా ఉంది.
ఈ క్రమంలోనే చాలా నెగిటివ్ టాక్‌తో పూర్ బజ్‌తో స్టార్ట్ అయిన మీకు మాత్రమే చెప్తా, ఆవిరి సినిమాలు కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. రెండు సినిమాలు ప్లాప్ అయినా ఇంత దారుణంగా… ఇంకా చెప్పాలంటే థియేటర్ల రెంట్లకు కూడా సరిపడా వసూళ్లు రాబట్టుకోకపోవడం మాత్రం అవమానమే అని చెప్పాలి.