ప్రముఖ నటి ఆత్మహత్య..కారణం అదేనా?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ తమిళ టీ వి హీరోయిన్ ప్రియాంక ఈ రోజు ఉదయం తన నివాసం లో ఫ్యాన్ కి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్య కి ప్రధాన కారణం అని సమాచారం. ప్రియాంక తమిళ్ లో ప్రముఖ నటి రమ్య కృష్ణ తో ‘వంశం’ అనే తమిళ టీ వి షో లో నటించారు. ఇవాళ ఉదయం ఇంటి పని మనిషి చేరుకొనేలోపే ప్రియాంక ఫ్యాన్ కి ఊరి వేసుకుని ఉన్నారని ఆమె తెలిపింది. ప్రియాంక కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారని ఆమె దగ్గరి బంధువులు తెలిపారు. అధికారికంగా ఆమె ఆత్మహత్య కి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ రోజు స్థానికులు పోలీసు వారికి ఈ సమాచారం ఇవ్వగా వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఆమె మృతి పై అనేక అనుమానాలు ఉన్న కారణంగా పోలీసు వారు ఆమె మృత దేహాన్ని పోస్ట్ మోర్టమ్ కోసం పంపారు. పోస్ట్ మోర్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రియాంక ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలిసే అవకాశముంది.
ప్రియాంక అపూర్వ రాగంగాళ్, భైరవి అనే టీ వి సీరియల్స్ లో నటించింది, సన్ టీ వి వారు ఈ టి వి షోస్ ని ప్రసారం చేసేవారు

Share.