మళయాళ భామ కీర్తి సురేష్ అక్కడే కాదు సౌత్ అంతటా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో మహానటి సినిమాతో అమ్మడి రేంజ్ డబుల్ అయ్యిందని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ మీద తన అభిప్రాయాన్ని తెలిపింది. తానింకా ప్రేమలో పడలేదని కాని తనకు ప్రేమ మీద నమ్మకం ఉందని అంటుంది కీర్తి సురేష్.
తన ఫ్యామిలీలో అందరిది లవ్ మ్యారేజే.. అమ్మానాన్నలు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు.. తన సిస్టర్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి టైం వచ్చేసరికి అది ప్రేమ పెళ్లా.. పెద్దలు కుదుర్చిన పెళ్లా అన్నది నిర్ణయించుకుంటానని. కాని ఇప్పుడు తన ఫోకస్ మొత్తం సినిమాల మీదే ఉందని చెప్పింది కీర్తి సురేష్. ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియాతో పాటుగా పెంగ్విన్ సినిమా చేస్తుంది.
పెంగ్విన్ సినిమాలో కీర్తి సురేష్ గర్భవతిగా నటిస్తుంది. ఈ సినిమాను కార్తిం సుబ్బరాజు నిర్మిస్తుండగా ఈశ్వర్ గౌతం డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.